ఫిబ్రవరి 16 న గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి

ఫిబ్రవరి 16 న గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి
  • రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి

ముద్ర/వీపనగండ్ల:-కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ బంధు కార్మికుల సమ్మేళ జయప్రదం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గోపాల్ దిన్నె గ్రామంలో ఇంటింటికి తిరిగి కరపత్ర పంపిణీ, రైతు సంఘం సభ్యత్వం క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశంలో అనుసరిస్తున్న ఆర్థిక మతతత్వ విధానాల ఫలితంగా ప్రజల జీవనాధాయం పడిపోయి పేదల సంఖ్య పెరుగుతుందన్నారు.

స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం రైతుల పెట్టిన పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధర గ్యారెంటీ  చట్టం చేయాలన్నారు. పేద మధ్యతరగతి రైతులు అందరికీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలి, 60 ఏళ్లు పైబడిన అందరికీ పింఛన్లు ఇవ్వాలన్నారు. నాలుగు లేబర్ కోడింగ్ రద్దు చేయాలి విద్యుత్తు సవరణ బిల్లు 2022 ఉపసంహరించుకోవాలన్నారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి ఉపాధి హామీ చట్టాన్ని విస్తరించి పని రోజు రెండు వందలకు పెంచాలని, రోజుకు 800 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న అన్ని వేతనాలు చెల్లించాలని, జాతీయ పట్టణ ఉపాధి హామీ చట్టం చేయాలని అన్నారు.కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ బంధు కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు భాస్కర్, జితేందర్, కిరణ్,ప్రజా సంఘాల నాయకులు చంద్రయ్య, రాముడు, కిష్టన్న తదితరులు పాల్గొన్నారు.