దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి 

దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయండి 
  • గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలి
  • సిఐటియు జిల్లా కార్యదర్శి సూర్యవంశం రాము
  • ఎంపీడీవో కార్యాలయంలో సమ్మె నోటీసు అందజేత

ముద్ర,పానుగల్:- దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయలని సిఐటియు జిల్లా కార్యదర్శి సూర్యవంశం రాము అన్నారు.సోమవారం పానుగల్ మండల కేంద్రములో గ్రామ పంచాయితీ కార్మికులతో కలిసి సమ్మె నోటీస్ ను ఎంపిడిఓ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బిజెపి ప్రభుత్వం అధికరంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయిన రైతన్న, కార్మిక వర్గ ప్రజల సమస్యలను పరిష్కరించలేదని,బిజెపి అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ హుసే లేదన్నారు.నిరుద్యోగం పెరిగి గత 50 సంవత్సరాల గరిష్ట సాయికి చేరిందని, పరిశ్రమ వేతల కార్పొరేట్ సంస్థల లాభాలను పెంచేందుకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయకపోవడంతో గ్రామపంచాయతీ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని,ఫలితంగా స్థిరమైన వేతనం, పని భద్రత ఉపాధి కరువైపోయిందన్నారు. కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని, కాంట్రాక్ట్ విధానం రద్దుచేసి కార్మికులను పర్మినెంట్ చేయాలని,జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దుచేసి పాత కేటగిరీలన్నిటిని యధావిధిగా కొనసాగించాలన్నారు.

విధి నిర్వహణలో ప్రమాదం జరిగి మరణించిన సిబ్బంది కుటుంబానికి నష్టపరిహారం 10 లక్షలు ప్రభుత్వమే ఇవ్వాలని దీని అమలు పోస్ట్ ఆఫీస్ బీమా పథకం ద్వారా చెల్లించాలని,ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలన్నారు.జాతీయ స్థాయి రాష్ట్రస్థాయి పండుగలకు సెలవులు మంజూరు చేయాలని, అధికారుల వేధింపులు ఆపాలని, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని అన్నారు.మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న ఉద్యోగ కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ సిఐటియు మండల అధ్యక్షులు సుగ్రీవుడు, మండల ఉపాధ్యక్షులు రంగస్వామి, ఎల్లయ్య, బాలకృష్ణ, శివరాజ్, మండల నాయకులు చందు,గోవిందు,నాగులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.