కొలహలంగా మహా ప్రదర్శన...

కొలహలంగా మహా ప్రదర్శన...

* గిరిజన సాంప్రదాయాలు, కోలాటాలతో ర్యాలీ..
* ఆకర్షంగా నిలిచిన గిరిజన నృత్యాలు..
* తరలివచ్చిన గిరిజనులు, యువతీ యువకులు
* ఆకట్టుకున్న వేదికపై గిరిజన నృత్యం

మిర్యాలగూడ ( ముద్ర న్యూస్ ):తెలంగాణ గిరిజన సంఘ రాష్ట్ర మహాసభ సందర్భంగా మిర్యాలగూడలో బుధవారం చేపట్టిన మహా ప్రదర్శన బహిరంగ సభ విజయవంతమైనది. పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి గాంధీ చౌక్ ఆర్టీసీ బస్టాండ్ రాజీవ్ చౌక్ మీదుగా భారీ ప్రదర్శన నిర్వహించారు. గిరిజన మహిళలు గిరిజన సాంప్రదాయాలతో నెత్తిపై ఖాళీ బిందెలతో ప్రదర్శన ఆకట్టుకుంది. యువతీ యువకులు పెద్ద ఎత్తున హాజరై ప్రదర్శనలో హోరెత్తించారు.

కోలాట బృందాలు వేసిన నృత్యాలు ఆకర్షించాయి. గిరిజన పాటలతో కిలోమీటర్ పొడవునా గిరిజనులు ర్యాలీ లో నిలిచారు. శ్రీరామ్ నాయక్ సుమారు రెండు గంటల పాటు సాగిన ర్యాలీ ఆకర్షించుకుంది. ఎల్ ఎస్ పి  క్యాంపు మైదానంలో జరిగిన బహిరంగ సభ వేదికపై అతిధులు హాజరుకాగా గిరిజన మహిళలతో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి డాన్స్ వేయడంతో గిరిజన ప్రజలందరూ సభా వేదిక దద్దరిలే విధంగా కేరింతలు వేశారు. గిరిజన సంఘం మహాప్రదర్శన బహిరంగ సభ విజయవంతమైంది.