పరిపాలనలో తనదైన ముద్ర వేస్తూ.. ముందుకు సాగుతూ..

పరిపాలనలో తనదైన ముద్ర వేస్తూ.. ముందుకు సాగుతూ..
  • క్యాంప్ ఆఫీస్ లోను విన తుల వెల్లువ ..
  • మంత్రి హరీష్ రావుకు రాత్రి అయినా తగ్గని జనం తాకిడి..

ముద్ర ప్రతినిధి : సిద్దిపేట: సిద్దిపేట శాసనసభ్యుడు,రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు రోజురోజుకు జనాధారణ పెరుగు తోంది.. సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటనలు కొనసాగిస్తున్న సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి వేలాదిగా జనం వచ్చి వేచిస్తున్నారు. చిన్న చితక పనుల కోసం కూడా మంత్రినే కలవ దానికి ఆసక్తి చూపుతున్నారు. తమ సమస్యలు తీర్చాలి అంటూ ఆయన్ని ఆశ్రయిస్తున్నారు. మంత్రి క్యాంప్ ఆఫీస్ కు రావడం ఆలస్యమైన, బాగా పొద్దుపోయిన ఓపికతో వేచి చూస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాధరణ ఉన్న నేతల్లో కెసిఆర్ తర్వాత హరీష్ రావే అనే విషయం అందరికీ తెలుసు...  నియోజకవర్గం లో మాత్రం నెంబర్ వన్ స్థానం హరీష్ రావు కే దక్కుతుంది.మామ కేసీఆర్ తనకు సిద్దిపేట అప్పగించిన నాటి నుండి నేటి వరకు ప్రజల్లో, పార్టీ ఇమేజ్ తో పాటు తన ఇమేజ్ కూడా దెబ్బతినకుండా తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు నియోజకవర్గంలో రోజంతా పర్యటించి వచ్చిన రాత్రికి కూడా సిద్దిపేటలోని తన క్యాంపు ఆఫీసుకు వచ్చిన వారిని సైతం ఏమాత్రం  ఆలక్ష్యం చేయకుండా వారి సమస్యలను ఓపికగా వినడం, సంబంధిత అధికారులకు ప్రజల వినతులను అప్పటికప్పుడే  అందజేస్తూ పరిష్కారాలు చేస్తుండడం వల్ల మంత్రి హరీష్ రావు నియోజకవర్గం లోనే కాదు రాష్ట్రంలో కూడా తిరుగులేని నేతగా ఎదుగుతున్నారు. ఆదివారము సిద్ధిపేట నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో దాదాపు 15 వేల మంది ప్రజలతో భేటీ అయిన.. రాత్రి కూడా క్యాంప్ ఆఫీసు వద్ద మరో వెయ్యి మంది వచ్చి కలిసిన వ్యక్తిగత సమస్యల నుంచి గ్రామ సమస్యలు, మండల సమస్యలను ఏ కరువు పెట్టిన ఓపికతో వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించారు. నిజానికి వర్గ నాయకులే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు, రాష్ట్రస్థాయి అధికారులతో భేటీ అవుతు తన పర్యటన కొనసాగించారు.. భారత రాష్ట్ర సమితి రాష్ట్రాన్ని దాటి దేశంలో ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తే జనం ఆదరణ ఉన్న నేతగా మరింత పెద్ద పదవిలో హరీష్ రావు బాధ్యతలు చేపట్టడం కాయంగానే కనిపిస్తున్నది ఆదివారం సార్ బహిరంగ సభల్లో చెప్పిన ..ఇక్కడ మీరు... అక్కడ సారు... దయ ఉంటే ఏదైనా చేస్తా అనే అర్థం లోని సారాంశం ఏమిటో అందరికీ అర్థం కావడం ఖాయం.. ఏ పదవి ఇచ్చినా పరి పాల హరీష్ రావు తనదైన ముద్ర వేయడం ఖాయం.