సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు మీడియాపై హీరో మోహన్ బాబు ఆగ్రహాం 

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు మీడియాపై హీరో మోహన్ బాబు ఆగ్రహాం 

ముద్ర, షాద్‌నగర్ : సినీ హీరో కళాప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు షాద్ నగర్ మీడియాపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆయన గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. అయితే మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్ కు వెళ్లారు. మీడియాను చూడగానే మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు  సీనియర్ నటుడైన మోహన్ బాబు తన ఆస్తికి సంబంధించి వీలునామా కోసం వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం అందుతుంది. అయితే ఈ వ్యవహారం మీడియా దృష్టి పడకుండా ఆయన వ్యవహరించడంతో అక్కడ ఉన్నవారు ఏం జరుగుతుందోనని చూస్తూ ఉండిపోయారు.