బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు

బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు
  • రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడో సారి బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం
  • నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

ముద్ర ప్రతినిధి, నల్లగొండ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడో సారి బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన వివిధ పార్టీల నుంచి 100 కుటుంబాలు బీఆర్ఎస్ లో చేరారు. చేరిన వారికి ఆయన గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం,డంపింగ్ యార్డు,  రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తున్నదన్నారు. రైతులకు పంట పెట్టుబడిసాయం చేయాలనే ధృఢ సంకల్పంతో రైతు బంధు, రైతు బీమా వంటి చారిత్రాత్మక పథకాలను సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని అన్నారు. పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా మేనమామ కట్నంగా ప్రభుత్వం అందజేస్తున్నదని చెప్పారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యంగులు, వృద్ధులకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ అందజేస్తున్నదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుంటోజు యాదగిరి, ముద్దసాని రమణారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతకింది తిరుమలయ్య, కార్యదర్శి తోటగిరి లింగస్వామి, చేకూరి బాబు రావు భవాని, తోటకురి లక్ష్మమ్మ, తెల్సురి లింగయ్య, సుగుణమ్మ, గుండెపురి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.