బీ ఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మూకుమ్మడిగా చేరికలు 

బీ ఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మూకుమ్మడిగా చేరికలు 

మంత్రి మహేందర్ రెడ్డి వర్గీయులుగా ముద్ర పడిన వారే పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్న వైనం

ముద్ర ప్రతినిధి ,వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో బుధవారం ఒక్కసారిగా మంత్రి మహేందర్ రెడ్డి వర్గీయులుగా భావిస్తున్న పలువురు బీ ఆర్ఎస్ కౌన్సిలర్లు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి , అబ్దుల్ రజాక్, బోయ రవిరాజ్, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ కవి, బీఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, బోయరాజు, మసూద్, రాకేష్ తో పాటు పలువురు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న డిసిసిబి జిల్లా చైర్మన్ మనోహర్ రెడ్డి వారిని
కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనూహ్యంగా ఒక్కసారిగా మంత్రి మహేందర్ రెడ్డి క్యాడర్గా భావిస్తున్న పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్డం నియోజకవర్గంలో తీవ్ర చేర్చండి అంశంగా మారింది. పార్టీ మారుతున్న నాయకులను తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రత్యేకంగా ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఘాటు హెచ్చరికలు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నాయకుల వలసలు ఏమాత్రం ఆగడం లేదు. బీఆర్ఎస్ పార్టీని వేడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఈ నాయకుల వెంట ఎవరైనా ముఖ్య నాయకుడు ఉన్నారా లేక  తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలోకి బీ ఆర్ఎస్ నాయకులు క్యు కడుతున్నారా ...అన్న ప్రశ్నలు సంశయాత్మకంగా మారాయి.