ఈ సంవత్సరం నుండే మెదక్ లో మెడికల్ కళాశాల తరగతులు- ఎమ్మెల్యే పద్మ ప్రశ్నకు మంత్రి హరీష్ రావు హామీ | Mudra News

ఈ సంవత్సరం నుండే మెదక్ లో మెడికల్ కళాశాల తరగతులు- ఎమ్మెల్యే పద్మ ప్రశ్నకు మంత్రి హరీష్ రావు హామీ | Mudra News

మెదక్‌లో ఈ సంవత్సరం నుండే వైద్య కళాశాల తరగతులు ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. శుక్రవారం ఎమ్మెల్యే ఎం. పద్మాదేవేందర్ రెడ్డి మెడికల్ కళాశాల ఏర్పాటు విషయంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలలో ప్రస్తావించారు. మెడికల్ కళాశాల ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, నిధుల విషయం ఏమిటని అడిగారు. మంత్రి హరీష్ రావు స్పందిస్తూ ఈ విద్యా సంవత్సరం నుండే వైద్య కళాశాల ప్రారంభించనున్నట్టు మంత్రి తన్నీరు హరీష్ రావు హామీ ఇచ్చారు. ఇందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే భూ సేకరణ కోసం జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు.