ఏసీబీకి చిక్కిన వైద్య శాఖ ఉద్యోగులు

ఏసీబీకి చిక్కిన వైద్య శాఖ ఉద్యోగులు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : హజీపూర్ మందళంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అవినీతి ఉద్యోగులు ఏసీబీకి పన్నిన వలలో చిక్కారు. ఓ వ్యక్తి నుంచి పది వేల రూపాయలు లంచంగా తీసుకోగా ఏసీబీ అధికారులు కాపు కాచి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆఫీసు సుపరింటెండెంట్  గా విధులు నిర్వహిస్తూ ఈ మధ్య కాలంలో రామగుండం కు బదిలీ పై వెళ్లిన షఫీద్దీన్, ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని సహకారంతో టైపిస్ట్ రాజనర్సు ద్వారా వాహన టెండర్ విషయం లో బాధితుడి వద్ద నుండి 10 వేల రూపాయలను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు నిర్వహిస్తున్నారు.