మై విలేజ్ షో ఫేం గంగవ్వ తో ముచ్చటించిన మంత్రి

మై విలేజ్ షో ఫేం గంగవ్వ తో ముచ్చటించిన మంత్రి

 ముద్ర, మల్యాల : మల్యాల మండలం లంబండిపల్లి లో మై విలేజ్ షో ఫేం గంగవ్వతో పాటు టీం సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మేల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలు కలిసి సన్మానించారు. గతంలో పిసిసి అద్యక్షుడిగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినసమయంలో గంగవ్వ టీంను కలిసి ముచ్చటించారు.

మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తామని గంగవ్వతో మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంత్రి గంగవ్వ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని, టీం సభ్యులతో మై విలేజ్ షో పై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను గంగవ్వ మంత్రి దృష్టికి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో ఆనంద్ రెడ్డి, ఆది రెడ్డి, బత్తిని శ్రీనివాస్, ముత్యపు శంకర్, సతీష్ రెడ్డి తిరుపతి, హరినాథ్, లక్ష్మణ చారి, మర్రి లక్ష్మణ్, శ్రీ కోటి శ్రీకాంత్, నక్క అనిల్, రామాంజనేయులు, మారుతి, పంజాల మల్లేశం తోపాటు తదితరులు ఉన్నారు.