పాఠశాలలో సీఎం అల్పాహార పథకాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి మంత్రి హరీశ్ రావు , విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పాఠశాలలో సీఎం అల్పాహార పథకాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి మంత్రి హరీశ్ రావు , విద్యా మంత్రి  సబితా ఇంద్రారెడ్డి

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రావిర్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో సీఎం  అల్పాహార పథకాన్ని  రాష్ట్ర ఆర్థిక మంత్రి మంత్రి హరీశ్ రావు ,విద్యా మంత్రి  సబితా ఇంద్రారెడ్డి  ప్రారంబించారు.  

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు రాష్ట్రవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులకు అల్పాహార పథకం అమలు చేస్తున్నామని,  27,147 పాఠశాలల్లో సీఎం అల్పాహార పథకం అమలు జరుగుతున్నది తేలిపారు. ఈ కార్యక్రమములో  ఎంపీలు రంజిత్ రెడ్డి, పాటిల్  ,ఎమ్మెల్సీలు శంభిపూర్ రాజు ,దయనంద్ గుప్తా ,రఘోత్తమ్ రెడ్డి ,ఎమ్మెల్యేలు కాలే యాదయ్య ,ఫైళ్ల శేఖర్ రెడ్డి , ఎడ్యుకేషన్‌, వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి, విద్యా శాఖ సెక్రెటరీ వాకాటి కరుణ ,పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన ,యువ నాయకులు కార్తీక్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

వికారాబాద్ లో మంత్రి మహేందర్ రెడ్డి

వికారాబాద్  నియోజకవర్గ శివారెడ్డిపేట  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని  రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంబించారు.

ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతు వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం  4 పాఠశాలల్లో 602 మంది విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభించడం జరిగిందని, జిల్లాలోని దసరా నుండి 1052 పాఠశాలల్లో 92000 మంది విద్యార్థులకు సీఎం అల్పాహార పథకం అంధుతుఁడని మంత్రి తెలిపారు.గతంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ ప్రక్షాళన చేస్తున్నారని, 
మన ఊరు మనబడి కార్యక్రమంలో  వికారాబాద్ జిల్లాలోని 371 పాఠశాలలను 109 కోట్లతో చేస్తున్నట్టు అభివృద్ధి చేస్తున్నట్టు తేలిపారు.

ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్, ఎంపీపీ చంద్రకళ లు పాల్గొన్నారు