క్రీడ‌లు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానిస్థాయి

క్రీడ‌లు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానిస్థాయి
  • రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటకశాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

ముద్ర,పానుగల్:- క్రీడ‌లు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానిస్థాయి అని తద్వారా సంపూర్ణ ఆరోగ్యంను పొందవచ్చని  రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటకశాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు.ఆదివారం పాన్ గ‌ల్ మండ‌లం కేతేప‌ల్లి గ్రామంలో  ఓపెన్ టు ఆల్  మ‌హిళ‌, పురుషుల వాలీబాల్ చాంపియ‌న్  షిప్ టోర్నీని మంత్రి ప్రారంభించారు.క్రీడాకారులను ప‌రిచ‌య కార్య‌క్ర‌మంలో పాల్గొని,వారితో క‌లిసి కాసేపు వాలీబాల్ ఆడి  ఉత్సాహం నింపారు.

అనంత‌రం మంత్రి మాట్లాడుతూ మారిన సమాజంతో పాటు క్రీడా పోటీల్లో పాల్గొనే వారి సంఖ్య తగ్గిపోయి, సెల్‌ఫోన్‌లకు అత్తుకుపోయి అనారోగ్యం పాలవుతున్నారన్నారు.  ఆహారపు అలవాట్లు మారిపోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యాలను కాపాడుకునేందుకు క్రీడలు, వాకింగ్, వ్యాయామం తదితరాలు అలవర్చుకోవాలని సూచించారు. ఆరోగ్యంగా ఉంటే ఎదైనా సాధించవచ్చు అని తెలిపారు.

ఫిట్నెస్ ఉన్న వారికి  స్థానిక ఎన్నిక‌ల్లో పోటీప‌డే అభ్య‌ర్థుల‌కు  టికెట్ కేటాయిస్తామ‌ని చెప్పడంతో స‌భ‌లో న‌వ్వులు విరిసాయి.మ‌రోవైపు యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, అందుకు తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరారు.  క్రీడాకారులు ఆటల‌ పోటీల్లో పాల్గొని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించాలన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ పగిడాల శ్రీనివాస్,మాజీ జెడ్పిటిసి రవి,మాజీ ఎంపీపీ వెంకటేశ్ నాయుడు, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు యెన్నం నరసింహ రెడ్డి,రాము యాదవ్, బ్రహ్మం,పుల్లారావు,స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.