విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి

విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ , జాతిపిత మహాత్మా గాంధీ గారి, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ ల విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి

ముద్ర, చేవెళ్ల:  చేవెళ్ళ మండలం రావులపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ , జాతిపిత మహాత్మా గాంధీ గారి, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ ల విగ్రహాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి పట్నం మహేందర్ రెడ్డి లూ ఆవిష్కరించారు. 10 లక్షల వ్యయంతో నిర్మించిన ఓపెన్ డ్రైనేజీని, 45 లక్షల రూపాయలతో వ్యయంతో నిర్మించిన సీసి రోడ్లను,12 లక్షల 60 వేలతో నిర్మించిన వైకుంఠదామాలను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి ,మహేందర్ రెడ్డి ప్రారంబించారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు కృషి చేస్తున్నాం అన్నారు..మహనీయులు అందించిన స్ఫూర్తి ఎంతో గొప్పదని వారి విగ్రహాలు భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తాయన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో స్వర్గీయ ఇంద్రారెడ్డి చెరగని ముద్ర వేసారని అన్నారు.

నియోజకవర్గములోని షాబాద్,శంకర్ పల్లిలలో ఏర్పాటు అవుతున్న కంపెనీలలో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి,ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.కాళేశ్వరం లాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పూర్తి చేస్తారని పేర్కొన్నారు.మరొక్కసారి యాదయ్య గారిని ఆశీర్వదించాలని ప్రజలకు మంత్రి కోరార్.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి ,ఎమ్మెల్యే కాలే యాదయ్య, డిసిఎంఎస్ చైర్మెన్ కృష్ణారెడ్డి , ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి , జడ్పిటిసి మాలతి కృష్ణారెడ్డి ,వైస్ ఎంపీపీ ప్రసాద్ ,సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ లు పాల్గొన్నారు.