అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం -కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

ముద్ర.వీపనగండ్ల(జులై 14): అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడం జరిగిందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు, శుక్రవారం మండల పరిధిలోని కల్వరాల లో 22 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని, కల్వరాల నుంచి బుసిరెడ్డిపల్లి మీదుగా జమ్మాపూర్  వరకు నాలుగు కోట్ల 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే బిటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు, ఈ సందర్భంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ గ్రామంలో సంపూర్తిగా నిర్మించి వదిలివేసిన గ్రంథాలయ భవన నిర్మాణానికి సిడిపి ఎంపీపీ నిధుల నుంచి పది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని, అంతేకాక గ్రామంలో హెల్త్ సెంటర్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు, గ్రామం చైతన్యవంతమైన గ్రామం అని చాలామంది విద్యావంతులు ఉన్నారని గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని సూచించారు, గ్రామంలోని పాఠశాలలో మౌలిక వసతులు కల్పింసిగి జిల్లా పరిషత్ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు, కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వరరావు, జడ్పిటిసి మాధురి కిరణ్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ రామన్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, కల్వరాల సర్పంచ్ రఘునాథ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో కథలప్ప, వీపనగండ్ల ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, సంపత్ రావు పల్లి సర్పంచ్ రామేశ్వరరావు గోపాల్ దిన్నె సర్పంచ్ విజయకుమార్, నాయకులు ముంత మల్లయ్య యాదవ్, సర్దార్, రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.