మహిళా బస్తి దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే

మహిళా బస్తి దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని హమాలివాడలో మహిళా బస్తి దవాఖానాను ఎమ్మెల్యే దివాకర్ రావు కలెక్టర్ సంతోష్ తో కలిసి ప్రారంభించారు. బుధవారం హమాలివాడ వాటర్ ట్యాంక్ సమీపంలో బస్తీ దవాఖానాలో మహిళల కోసం ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. వారానికి ఒకరోజు మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్బారాయుడు,  మున్సిపల్ చైర్మన్ రాజయ్య , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.