కానిస్టేబుల్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

కానిస్టేబుల్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

ముద్ర, మల్యాల: మల్యాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న వేదశ్రీ అనే మహిళా కానిస్టేబుల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగ, ఆమె కుటుంబ సభ్యులను గురువారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శించారు. సిరిసిల్లలోని వేదశ్రీ ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే రవిశంకర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం వేదశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట పలువురు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులున్నారు.