చివరి బొట్టు వరకు నీరందించి పంటలను కాపాడుతాం ...

చివరి బొట్టు వరకు నీరందించి పంటలను కాపాడుతాం ...
  • పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి పదివేల పరిహారం అందిస్తాం
  •  సాగు నీటి ఎద్దడికి  గత ప్రభుత్వ వైఫల్యమే కారణం..
  • నిజమాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ప్రాజెక్టు లోని చివరి బొట్టు వరకు నీటిని అందించి, పంటలను కాపాడేందుకు కృషి చేస్తాంమని నిజమాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్ కుమార్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి.. వేడుకలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డీ మాట్లాడుతూ రబీ ప్రణాళిక రూపొందించకుండ ఎల్లంపల్లి నుండి నీటిని తరలించే అవకాశం ఉన్నప్పుడు ఎస్ ఆర్ ఎస్ పి నుండి నీటిని తరలించడంతో 10 టీ ఎం సీ ల మిడ్ మనేరుకు నీటి కొరత ఏర్పడిందని, గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో సాగు నీటి సమస్య ఏర్పడిందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని.. కెసిఆర్ చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

పంట నష్ట పోయిన రైతులకు ఎకరానికి రు.10 వేలు అందిస్తాంమని పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో ఏనాడైనా రైతులను ఆదుకోవాలని ఆలోచన కలిగిందా..అని కెసిఆర్ ను నిలదీశారు.పంటల బీమా పథకం అమలు చేయకపోవడం తో పరిహారం అందలేదని, సీఎం రేవంత్ రెడ్డీ భవిషత్తులో పంట నష్ట పోయిన రైతులను ఆదుకోవడానికి పంటల బీమా పథకం అమలు చేస్తారని పేర్కొన్నారు.  రుణ మాఫీ ఏమైంది కెసిఆర్ అడగడం హాస్యాస్పదం, కెసిఆర్ గడిచిన ఐదేళ్ల కాలంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు..పంట రుణాలు ప్రభుత్వమే పుచి కత్తుగా ఉండి, ఖరీఫ్ నుండి యదావిధిగా పంట రుణాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. కెసిఆర్ పాలనలో మూడు కుంభకోణాలు రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం బీ ఆర్ ఎస్ పార్టీ కనుమరుగు కాబోతుందని అన్నారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ కుమార్ మాట్లాడుతూ పంటలు ఎండిపోతున్నాయి అని జగిత్యాల జిల్లాకు గానీ సాగు నీటికి, తాగు నీటి కి ఒక్క ప్రాజెక్ట్ తీసుకువచ్చారా.., ధర్మపురి నియోజక వర్గ సమస్యల కోసం కొప్పుల ఈశ్వర్ ఎనాడైనా కెసిఆర్ దగ్గరికి వెళ్ళావా అని ప్రశ్నించారు. రిజర్వాయర్ ఏర్పాటు చేస్తాం అని చెప్పిన హామీ ఏమైంది నిలదీశారు. కొప్పుల దీక్ష ను ఎవరు నమ్మరు. రైతుల ను రైస్ మిల్లర్లు దోపిడీ చేస్తున్నా పట్టించుకోని ఈశ్వర్ రైతుల గురించి మాట్లాడం హాస్యాస్పదమని, కపట ప్రేమ, కొప్పుల ఈశ్వర్ ధోరణిని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ అధ్యక్షులు గిరి నాగభూషణం, తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, కల్లపెల్లి దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.