కుల గణన విషయంలో కాలయాపన చేయొద్దు

కుల గణన విషయంలో కాలయాపన చేయొద్దు
  • సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీ నరసింహ సాక్షిగా దళితు మంత్రులకు అవమానం
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, మంత్రి కొండ సురేఖకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి
  • జాగృతి జాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ముద్ర ప్రతినిధి, నల్గొండ: కులగణన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయొద్దని జాగృతి జాతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో యునైటెడ్ పూలే ఫ్రంటు, జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకు ముందు క్లాక్ టవర్ సెంటర్లోని పూలే విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కచ్చితంగా బీసీలకు 42% అమలు చేసి వారికి న్యాయం చేయాలన్నారు. గురుకులాల్లో 85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆనాడు సీఎం కేసీఆర్ జీవో ఇచ్చారని తెలిపారు. బీసీలకే కాదు అగ్రవర్ణాలకు సంబంధించిన సీఎం రేవంత్ ఇవాళ యాదాద్రి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజ, సన్మానంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మంత్రి కొండ సురేఖకు తీవ్ర అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా అసెంబ్లీ ఆవరణంలో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్కు వినతిపత్రం ఇస్తే దళితుడికి వినతిపత్రం ఇస్తారని రేవంత్ రెడ్డి అవమానించారన్నారు.

అప్పుడు ఓపిక పట్టణం నేడు సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా దళితుడైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను రేవంత్ రెడ్డి అవమానించారని ఇలాంటి దౌర్భాగ్యం ఎక్కడా లేదని అన్నారు వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, మంత్రి కొండ సురేఖకు క్షమాపణలు చెప్పాలని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, సుంకరి మల్లేష్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, చీర పంకజ్ యాదవ్ బొర్ర సుధాకర్, గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షులు దూదిమెట్ల బాలరాజు యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీం పాషా, జిల్లా జాగృతి అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, నాయకులు, ఫరీదొద్దీన్, సింగం రామ్మోహన్, బక్క పిచ్చయ్య, తండు సైదులు గౌడ్, నారబోయిన బిక్షం లోడంగి గోవర్ధన్, అయితగోని యాదయ్య, కౌన్సిలర్ మారగోని గణేష్, కొండూరి సత్యనారాయణ, మిర్యాల యాదగిరి తదితరులు ఉన్నారు.