ప్రపంచ వ్యాప్తంగా యోగాకు ప్రత్యేక స్థానం కల్పించింది మోదీ

ప్రపంచ వ్యాప్తంగా యోగాకు ప్రత్యేక స్థానం కల్పించింది మోదీ
  • రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్

ముద్ర, ముషీరాబాద్:అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గం గాంధినగర్ డివిజన్ లోని సమత భవన్ లో శ్రీ సాధుముర్గి జైన్, సమత యువ సంఘ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్య సభ సభ్యులు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎనుగు పావని, బిజెపి నగర నాయకులు ఎనుగు వినయ్ కుమార్ పాల్గొన్నారు. యోగా టీచర్ సూశీల్ జైన్ నేతృత్వంలో యోగా ఆసనాలు వేసారు. అనంతరం డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా యోగా కు ప్రత్యేక స్థానం ఏర్పరచింది విశ్వాగురు, భారత ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. భారతదేశంలో యోగ ఒక అంతర్భాగం. మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి , ఆత్మశక్తిల కలయికనే యోగ అన్నారు. సనాతన భారతీయ ధర్మం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప వరం యోగ అని చెప్పారు. మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తూ ఆనందాన్ని శారీరక సంపదనిచ్చే దివ్య ఔషధం యోగా అని వివరించారు. స్ధానిక కార్పొరేటర్ ఎనుగు పావని మాట్లాడుతూ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు, తనువు మనసు ఆత్మను ఏకం చేసే సాధనమే యోగ అన్నారు. నేటి తరం పిల్లలు, యువతకు యోగను  జీవిత విధానంలో ముఖ్య భాగమని, ప్రతి రోజు యోగాసనాలను వేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో శ్సాధుముర్గి జైన్, సమత యువ సంఘ్ హైదరాబాద్  కమిటీ సభ్యులు పాల్గొన్నారు