ఎమ్మార్పీఎస్ తెలంగాణ పాలకీడు మండల ఇన్చార్జిగా అమరారాపు జీవరత్నం ..నియామకం

ఎమ్మార్పీఎస్ తెలంగాణ పాలకీడు మండల ఇన్చార్జిగా అమరారాపు జీవరత్నం ..నియామకం

ముద్ర,పాలకీడు: ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుదు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు పాలకీడు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం హుజూర్నగర్ ఇన్చార్జి పెద్దపంగా కాటమయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. పాలకీడు మండల ఇన్చార్జిగా అమరారపు జీవరత్నంను  నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెటి లక్ష్మణ్ మాదిగ నియామక పత్రం అందజేశారు. మేడి పాపయ్య నాయకత్వంలో సంఘాన్ని ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలను పునర్నిర్మాణం చేసుకొని సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

ఏబిసిడి వర్గీకరణకు మాదిగల యొక్క హక్కులకి ,డిమాండ్లకు పాపన్న వెంట ఉద్యమంలో భాగస్వాములు అవుతాము జిల్లా అధ్యక్షులు వడిదల రవికుమార్ కోర్ కమిటీ సభ్యులు చింతాబాబు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరికంటి అంబేద్కర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కనుక జానయ్య మాదిగకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కనుక జానయ్య మాదిగ, రేవూరి విజయ్ కుమార్, నగరికంటి జాను, వింజమూరు శ్రీకాంత్,  జొన్నలగడ్డ లక్ష్మణ్, వడ్లమూడి ఉపేందర్ రావ్ తదితరులు పాల్గొన్నారు