బిల్లు పెట్టకపోతే బిజెపితో యుద్ధమే

బిల్లు పెట్టకపోతే బిజెపితో యుద్ధమే

ముద్ర, చివ్వెంల : ఈనెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ చివ్వెంల మండల ఇన్చార్జి  బోడ్డు విజయ్ కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని తాసిల్దారు కార్యాలయం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీని తొమ్మిదేళ్లు గడిచిన నేటి వరకు అమలు చేయలేదన్నారు. ఈ నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల  వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలన్నారు. రిలే నిరాహార దీక్షలు ఈ నెల 22 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో  *ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ , చెరుకుపల్లి సతీష్ మాదిగ*ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర నాయకులు ఎర్ర వీరస్వామి మాదిగ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టల మల్లేష్ మాదిగ పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు దురాజ్ పల్లిMRPS గ్రామ శాఖ అధ్యక్షులు మొండి కత్తి జానకి రాములు మాదిగ సిరుపంగి లింగస్వామి మాదిగ యాసాని లింగస్వామి మాదిగ పాల్వాయి ప్రభాకర్ మాదిగ మొండి కత్తి విక్రమ్ మాదిగ ఒంటెపాక చింటూ మాదిగ మొండి కట్టి నవీన్ మాదిగ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.