రాబోయే ఎన్నికల్లో ముదిరాజ్ లు సత్తా చూపాలి ఒక్క సీటు ఇవ్వకపోవడం అవమానకరం

రాబోయే ఎన్నికల్లో ముదిరాజ్ లు సత్తా చూపాలి ఒక్క సీటు ఇవ్వకపోవడం అవమానకరం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న ఎన్నికల్లో ముదిరాజ్ కులస్థులకు ఒక్కసీటు కూడా ఇవ్వకపోవడం పట్ల మంచిర్యాల జిల్లా ముదిరాజ్ లు నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ఐబీ చౌరస్తా లో ముదిరాజ్ లు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. తెలంగాణ లో ముదిరాజ్ కులస్థుల ఓట్లు అత్యధికంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ప్రకటించకపోవడం దారుణమని ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు తూటు శ్రీనివాస్ అన్నారు. టికెట్ లు ఇవ్వకుండా ముదిరాజ్ కులస్థులను కేసీఆర్ అవమానపరిచారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తులు కేసీఆర్ కు చెంపపెట్టు విధంగా తీర్పు ఇచ్చి ముదిరాజ్ ల సత్తా చూపాలని పిలుపునిచ్చారు.