కోదాడ నియోజకవర్గ ఓటర్ల సమగ్ర సమాచారం

కోదాడ నియోజకవర్గ ఓటర్ల సమగ్ర సమాచారం

కోదాడ పట్టణం: కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 58 పోలింగ్ కేంద్రాలు ఉండగా అత్యధికంగా మొత్తం 53,672 ఓట్లు ఉండగా పురుష ఓటర్లు 25,857 కాగా మహిళా ఓటర్లు 27,806 మంది ఉన్నారు . ట్రాన్స్ జెండర్లు 9 మంది తో కలిపి మొత్తంగా మున్సిపాలిటిలోని 35 వార్డులలో 53,672 మంది ఓటర్లున్నారు . మున్సిపాలిటీలోని బాలాజీ నగర్లో 2076 మంది ఓటర్లుండగా , లక్ష్మీపురం కాలనిలో 2632 మంది ఓటర్లుండగా , శ్రీరంగపురం లో 2134 మంది , తమ్మార - బండపాలెం లో కలిపి 3207 మంది ఓటర్లు , కొమరబండ లో 3484 మంది ఓటర్లున్నారు . ఇక కేవలం కోదాడ పట్టణంలో 40551 మంది ఓటర్లున్నారు .

మండలాల వారీగా మోతే

మోతే మండలంలో మొత్తం 46 పోలింగ్ స్టేషన్లు ఉండగా 34,528 మంది ఓటర్లున్నారు . పురుష ఓటర్లు 17340 మంది కాగా మహిళా ఓటర్లు 17188 మంది ఉన్నారు . ఇక మోతే మండలంలో 16 గ్రామాలతో పాటు 10 హామ్లెట్ విలేజెస్ తో మొత్తంగా 26 గ్రామాలున్నాయి . అత్యధికంగా సిరికొండ గ్రామంలో 3194 ఓట్లు ఉండగా అత్యల్పంగా రంగాపురం తండాలో 297 ఓట్లు ఉన్నవి . ఇక మండల కేంద్రమైన మోతే లో 2025 ఓట్లు ఉన్నవి .

మునగాల

మునగాల మండలంలో మొత్తం 44 పోలింగ్ కేంద్రాలు ఉండగా 16996 మంది పురుష ఓటర్లు , 17418 మంది మహిళా ఓటర్లతో మొత్తం 34414 మంది ఓటర్లున్నారు . ఇక మండలంలో మొత్తం 21 గ్రామాలు ఒక హామ్లెట్ గ్రామం తో 22 గ్రామాలున్నాయి . ఇక మండలంలో అత్యధికంగా 5161 మంది ఓటర్లతో మండలకేంద్రమైన మునగాల ఉండగా అత్యల్పంగా 382 ఓట్లు కలిగిన హామ్లెట్ విలేజ్ అయిన ఈదులవాగు తండా ఉంది .

చిలుకూరు

చిలుకూరు మండలంలో మొత్తం 38 పోలింగ్ స్టేషన్లు ఉండగా 15122 మంది పురుష ఓటర్లు , 15749 మంది మహిళా ఓటర్లతో మొత్తం మండలంలో 30871 ఓట్లు ఉన్నవి . మండలంలో మొత్తం 17 గ్రామాలుండగా అత్యధిక ఓటర్లు కలిగిన గ్రామపంచాయితిగా 5959 ఓట్లతో బేతవోలు ఉండగా ఇక అత్యల్పంగా 523 ఓట్లతో రామచంద్రాపురం ఉన్నది . మండల కేంద్రమైన చిలుకూరులో 5730 మంది ఓటర్లున్నారు .

అనంతగిరి

అనంతగిరి మండలంలో మొత్తం 33 పోలింగ్ కేంద్రాలు ఉండగా 11963 మంది పురుష ఓటర్లు , 12323 మంది మహిళా ఓటర్లు మరియు ఒక ట్రాన్స్ జెండర్ తో కలిపి 24287 మంది ఓటర్లు మండలంలో ఉన్నారు . ఇక మండలంలో మొత్తం 11 గ్రామాలు , 9 హామ్లెట్ గ్రామాలతో 20 మండలంలో ఉన్నాయి . మండలంలో అత్యధికంగా 2478 ఓటర్లతో గోండ్రియాల గ్రామం ఉండగా అత్యల్పంగా 303 ఓట్లు కలిగి హామ్లెట్ గ్రామమైన అజ్మీరా తండా ఉన్నది . ఇక మండల కేంద్రమైన అనంతగిరిలో మొత్తం 2127 మంది ఓటర్లున్నారు . నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మండలం ఇదే కావడం విశేషం .

కోదాడ

కోదాడ మండలంలో మొత్తం 38 పోలింగ్ కేంద్రాలుండగా 14111 మంది పురుష ఓటర్లు , 14577 మహిళా ఓటర్లతో కలిపి మొత్తం 28688 ఓటర్లు కోదాడ మండలంలో ఉన్నారు . మొత్తం పది గ్రామాలుండగా 5 హామ్లెట్ గ్రామాలతో కలిపి 15 గ్రామాలు మండలంలో ఉన్నాయి . అత్యధికంగా 3810 ఓట్లు కాపుగల్లు గ్రామంలో ఉండగా , అత్యల్పంగా 211 ఓట్లు హామ్లెట్ గ్రామమైన నెమలిపురి లో ఉన్నవి .

నడిగూడెం

నడిగూడెం మండలంలో మొత్తం 29 పోలింగ్ కేంద్రాలు ఉండగా 11377 మంది పురుష ఓటర్లు , 11379 మంది మహిళా ఓటర్లతో మొత్తం 22757 ఓటర్లతో నియోజక వర్గంలో తక్కువ ఓట్లు కలిగిన మండలం గా ఉన్నది . ఇక మండలంలో మొత్తం 15 గ్రామాలు ఉండగా , అత్యధిక ఓటర్లు కలిగిన గ్రామం గా 3111 ఓట్లు నడిగూడెం మండల కేంద్రం లో ఉండగా అత్యల్ప ఓట్లు కలిగిన గ్రామంగా 641 ఓట్లతో చాకిరాల గ్రామం ఉన్నది .