మోత్కూర్ లో ఘనంగా విద్య దినోత్సవాలు.

మోత్కూర్ లో ఘనంగా విద్య దినోత్సవాలు.
  • తల్లిదండ్రులు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించండి.
  • మునిసిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి.

మోత్కూర్(ముద్ర న్యూస్):తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యా దినోత్సవాలను అంగడి బజార్ లోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో మున్సిపల్ చైర్ పర్సన్  తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా  సావిత్రి మేఘారెడ్డి  మాట్లాడుతూ ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమం ద్వారా మన పాఠశాల కు అన్నీ రకాల వసతులు కల్పించినట్లు, విద్యార్థులకు డెస్క్ బెంచీలు, డిజిటల్ తరగతులకొరకు టీవి, మొదలగునవి సమకూర్చినట్లు తెలిపారు.  విద్యార్థులు చక్కగా ఆంగ్ల విద్యను కూడా ఈ పాఠశాల ద్వారా పొందవచ్చని, ప్రైవేట్ పాఠశాలలకన్నా నాణ్యమైన విద్యను అందించే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు.  ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత యూనిఫామ్స్ , నోట్ బుక్స్ ను కూడా పంపిణీ చేశారు.  తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్  బొల్లేపల్లి వెంకటయ్య , కౌన్సిలర్స్ బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, శ్రీ కూరేళ్ళ కుమార స్వామి, పాఠశాల ఎస్ ఎంసీ ఛైర్మన్  దండ కళ్యాణ్ , శ్రీ రమేశ్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రాజిడి రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయినిలు  కె. అరుణా దేవి, సౌజన్య, లలిత, ఎం ఆర్ సి ,యం.ఐ.యస్ కో ఆర్డినేటర్ శ్రీమతి ఉమా రాణి, మోహనాచారి, విద్యార్హినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.