అదనపు కలెక్టర్ హామీతో సమ్మె  విరమించిన మునిసిపల్ సిబ్బంది

అదనపు కలెక్టర్ హామీతో సమ్మె  విరమించిన మునిసిపల్ సిబ్బంది

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గత నాలుగు రోజులుగా నిర్మల్ పురపాలక సంఘం తాత్కాలిక సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సమ్మె ఆదివారం విరమించారు. గత ఎనిమిది మాసాలుగా వేతనాలు చెల్లించకపోవడం, పి ఎఫ్ సమస్యలు పరిష్కరించక పోవటం, పి ఎఫ్ మొత్తాలను ఖాతాలో జమ చేయకపోవటం తదితర సమస్యల పరిష్కారం కోసం ఈ సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదివారం దీక్షా శిబిరాన్ని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. ఈ నెల 15 లోగా వారి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో మునిసిపల్ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.