హైడ్రా నోటీసులపై మురళీమోహన్ ఫస్ట్ రియాక్షన్..
హైడ్రా నోటీసులపై స్పందించారు సినీనటుడు మురళీమోహన్. హైడ్రా తనకు నోటీసులు ఇచ్చిన మాట నిజమే అని అన్నారు. నానక్‌రూమ్‌గూడలోని రంగలాల్‌కుంట బఫర్‌జోన్‌లో 3 అడుగుల మేర రేకుల షెడ్ ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారని చెప్పారు. 15 రోజుల్లో బఫర్ జోన్‌లో ఉన్న షెడ్‌ను తొలగించకుంటే మేమే కూల్చేస్తామని హైడ్రా ఆదేశించిందని అన్నారు. మంగళవారంలోగా మేమే షెడ్ తొలగించేస్తాం అని చెప్పారు. జయభేరి ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని అన్నారు. మూడు దశాబ్దాలుగా తాము రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నామని, అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు.