హైదరాబాద్‌లో మర్డర్ ....

హైదరాబాద్‌లో మర్డర్ ....

ముద్ర,హైదరాబాద్:- హైదరాబాద్‌ బాలాపూర్‌లో దారుణం జరిగింది. అంతా చూస్తుండగానే ఓ యువకుడిని హత్య చేశారు. బాలాపూర్‌లోని రాయల్ కాలనీలో ఘటన జరిగింది. సమీర్ (28) అనే యువకుడిని కత్తితో పొడిచి రాళ్లు, కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు దుండగులు. సమీర్‌ను ముగ్గురు వ్యక్తులు రౌండప్ చేసి మర్డర్‌ చేశారు. ఓ వ్యక్తి కత్తితో పొడవగా.. రాళ్లు, కర్రలతో మరో ఇద్దరి దాడి చేశారు. హత్య చేసి ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. హత్య చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాతకక్షలే కారణమా, ఆర్థిక వ్యవహారమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.