మా ఇంటి ఓట్లు కారుకే...

మా ఇంటి ఓట్లు కారుకే...

వేరే పార్టీ వాళ్లు ఇబ్బంది పెట్టొద్దు
మెట్‌పల్లి ముద్ర:- ‘మా ఇంటి ఓట్లన్నీ కారు గుర్తుకే వేస్తాం.. వేరే పార్టీల వారు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు..' అని మల్లాపూర్ మండలంలోని సంగెం-శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి గేట్ కు ఇలా పేపర్ రాసి అతికించడం చర్చనీయంగా మారింది. వేరే పార్టీల అభ్యర్థులు, నాయకులు వచ్చి తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దనే ఇలా ఏర్పాటు చేసినట్లు ఇంటి యజమాని జంగం శేఖర్ తెలిపారు.