నాగశౌర్య రంగబలి ట్రైలర్‌

నాగశౌర్య రంగబలి ట్రైలర్‌

యంగ్ హీరో నాగ శౌర్య కెరియర్ లో సక్సెస్ లకంటే  ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటాయి. అతని కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే చలో అని ఎవరైనా చెబుతారు. ఆ మూవీ తర్వాత మరలా ఆ స్థాయిలో సక్సెస్ ని నాగ శౌర్య సొంతం చేసుకోలేదు. సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు చేస్తోన్న కూడా చెప్పుకోదగ్గ కంటెంట్ లు పడటం లేదు. ప్రస్తుతం రంగబలి సినిమా తో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పవన్ బసం శెట్టి దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇక ట్రైలర్ లోకి వెళ్తే ఈ ఊరంటే నీకు ఇష్టమా అనే మురళీ శర్మ డైలాగ్ తో స్టార్ట్ చేశారు. ప్రతి మనిషి కి సొంతిళ్ళు ఉండకపోవచ్చు. సొంత పొలం ఉండకపోవచ్చు. కాని సొంతూరు మాత్రం ఉంటది అంటూ నాగ శౌర్య చెప్పే డైలాగ్ తో అతని క్యారెక్టర్ ని హీరో పరిచయం చేసేశాడు. సొంతూరంటే ఇష్టంతో పనిపాట లేకుండా ఎంజాయ్ చేస్తూ  హ్యాపీ గా గడిపేస్తున్న హీరో వాడి లైఫ్ లోకి అనుకోకుండా మెడికల్ స్టూడెంట్ గా వచ్చిన హీరోయిన్ ఆమె తో ప్రేమాయణం ఆపై ఊరిలో హీరో చేసే అల్లరి పనులతో ఆద్యంతం నవ్వులు పూయిస్తూ ట్రైలర్ ని ఆరంభంలో నింపేశారు. చివర్లో లోకల్ పొలిటికల్ లీడర్ గా షైన్ టామ్ చాకో నటించాడు. ఆ రాజకీయ నాయకుడితో హీరో తలపడటం ఆపై వాడికి ఎదురుతిరిగి జనంతో పూలదండలు వేయించుకోవడం ద్వారా యాక్షన్ ఎలిమెంట్స్ కూడా మూవీ లో భాగానే ఉన్నాయని చూపించారు.