బీఆర్ఎస్ పార్టీకి నకిరేకల్ ఎంపీపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి నకిరేకల్ ఎంపీపీ రాజీనామా

ముద్ర ప్రతినిధి, నల్గొండ: బీఆర్ఎస్ పార్టీకి నకిరేకల్ ఎంపీపీ బాచుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు గురువారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు రాసిన రాజీనామా లేఖలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఎదుగుదలను చూసి ఓర్వలేక కావాలనే తమ అనుచరులపై ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్యే తీరు బాగాలేకనే పార్టీని వీడుతున్నట్లు ఆమె లేఖలు క్లుప్తంగా తెలిపారు. తమ అనుచర వర్గంతో సంప్రదింపులతోనే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.