నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బనగోని రమేష్ కాంగ్రెస్ లో చేరిక

నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బనగోని రమేష్ కాంగ్రెస్ లో చేరిక

కండువా కప్పి పార్టీ ఆహ్వానించిన నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ముద్ర ప్రతినిధి, నల్గొండ: నల్గొండలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బనగోని రమేష్ తో పాటు 5 గురు కౌన్సిలర్లు పబ్బు సందీప్, ఖయూమ్ బేగ్, బషీరోద్దీన్, ప్రదీప్ నాయక్, భాస్కర్ లు భువనగిరి ఎంపీ, నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆరాచకపు పాలనలో ఉండడం ఇష్టం లేక ప్రజాపాలన కోరుకుని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని కౌన్సిలర్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చెప్పే అబద్ధం మాటలు నమ్మలేక కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అన్నారు. అబద్ధపు మ్యానిఫెస్టో ప్రజల ముందు ఉంచటం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కాపీ కొట్టి ఎన్నికల్లో ప్రజలు మోసం చేసి గెలుద్దాం అనుకున్న కేసీఆర్ కు ప్రజలు చెంపదెబ్బల బుద్ధి చెప్తారన్నారు.