ముత్తారం మండలంలోవిద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతులకు  శాపంగా మారింది..

ముత్తారం మండలంలోవిద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతులకు  శాపంగా మారింది..
  • మండలంలో  ఎండుతున్న పంట పొలాలు పట్టించుకోని విద్యుత్ అధికారులు
  • అవేదన వ్యక్తం చేస్తున్న సర్వారం, మైదంబండ రైతులు

ముద్ర ముత్తారం: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతుంది. ఆరుకాలం కష్టపడి పండించిన వరి పంట చేతికి వచ్చే సమయంలోనే పంట పొలాలకు విద్యుత్ అందించడంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,  దీంతో  తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుందని, ముత్తారం మండలంలోని మైదంబండ,  సర్వారం, పోతారం, లక్కారం మచ్చుపేట రైతులు మంగళవారం ఎండుతున్న పొలాల వద్ద  నిలుచొని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముత్తారం మండలంలోని ఆయా గ్రామాలలో  త్రీఫేస్ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో పంట చేతికచ్చే సమయంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తమకు శాపంగా మారి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.  ప్రభుత్వ మాత్రం 24 గంటలు విద్యుత్ అందిస్తుందని ఒకపక్క చెబుతున్న అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ అందించడంలో విఫలమవుతున్నారని రైతులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి త్రీఫేస్ విద్యుత్ ను నిరంతరం అందించాలని లేకుంటే మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేపడుతతామని రైతులు హెచ్చరిస్తున్నారు.