Take a fresh look at your lifestyle.

హోలీ సంబరాల్లొ కొత్త సీపీ

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగను పురస్కరించుకొని పోలీస్‌ అధికారులు, సిబ్బంది కలిసి పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝాకు రంగులు పూయడం తో కమీషనరేట్ కార్యాలయంలో సంబరాలు ప్రారంభమయ్యాయి.సీపీ సైతం అధికారులు, సిబ్బందికి రంగులు పూసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.బ్యాండ్‌ వాయిద్యాలతో అందరు ఆనందంతో నృత్యాలు చేశారు. అనంతరం సంబరాల్లో పాల్గొన్న చిన్న పిల్లలకు పోలీస్‌ కమిషనర్‌ మిఠాయిలు అందజేశారు.ఈ హోలీ వేడుకలను పురస్కరించుకొని పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషాలు, వెల్లివిరియాలని,ఈ హోలీ పండుగ మీ జీవితాలను రంగులమయం చేయాలని అన్నారు.ఈ వేడుకల్లో మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్, ట్రాఫిక్ ఏసీపీ నర్శింహులు, టాస్క్ ఫోర్సు ఏసీపీ మల్లారెడ్డి , ఇన్ స్పెక్టర్లు, ఆర్‌.ఐలు, సీసీ హరీష్, ఎస్‌.ఐ, ఆర్ఎస్ఐలు ఇతర పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.