కేంద్రమంత్రి నితిన్ ను కలిసిన ఎన్.హెచ్.63 బాధితులు

కేంద్రమంత్రి నితిన్ ను కలిసిన ఎన్.హెచ్.63 బాధితులు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలో నూతనంగా జాతీయ రహదారి 63 నిర్మాణంతో ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులు కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిశారు. మంగళవారం బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు ఆధ్వర్యంలో బాధితులు ఢిల్లీలోని మంత్రి గడ్కరిని కలిసి బాధను వెళ్లబోసుకున్నారు. ఎన్. హెచ్.63 రహదారి కొత్త మార్గం నిర్మాణం జరపాలని అధికారులు సర్వే చేయడంతో తమ నివాస గృహాలు, పంటపొలాలు కోల్పోవలసి వస్తుందని బాధితులు మంత్రికి వివరించారు. రహదారి నిర్మాణం పై పున:పరిశీలన చేసి న్యాయం చేయాలని కోరారు. సావధానంగా బాధితుల వేదనను ఆలకించిన మంత్రి సంబంధిత జాతీయ రహదారుల శాఖ అధికారులను కలవాలని సూచించారని రఘునాథ రావు తెలిపారు. మంత్రి సూచనలతో ప్రత్యామ్నాయ మార్గంలో రహదారి నిర్మాణం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.