పచ్చదనం కాదు.. పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర కోనేరు

పచ్చదనం కాదు.. పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర కోనేరు

ముద్ర, బాసర: చూడటానికి పచ్చదనంతో ఆట మైదానంలో కనిపిస్తున్న ఈ ప్రాంతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో కోనేరు ప్రాంతం. అధికారుల నిర్లక్ష్యం వల్ల కోనేరుపై పిచ్చి మొక్కలు పరుచుకొని ఇలా మైదానంలో తలపిస్తుంది. బతుకమ్మ పండుగ తప్పితే మిగతా రోజుల్లో దీనిని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. బాసరకు వచ్చే భక్తులకు కోనేరు ఉందనే సంగతి కూడా తెలియదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోనేరుకు వెళ్లే దారికి సూచిక బోర్డు ఏర్పాటు చేసి దాన్ని శుభ్రపరచాలి అని భక్తులు కోరుతున్నారు.