అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పిల్లలకు పౌష్టికాహారం

అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పిల్లలకు పౌష్టికాహారం

అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని, గర్భి మహిళలకు ఆరోగ్య లక్ష్మి క్రింద ఒక పూట భోజనం పెడుతున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం నర్సాపూర్  మండలం  లింగాపూర్ లో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. 


 విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే క్రింద మొదటి బుధ, శనివారాలలో అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల ఎత్తు, బరువులు పరీక్షించి తీవ్ర పోషక లోపం ఉన్న పిల్లలు, వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు లోపం  ఉన్న పిల్లలను గుర్తించి గ్రుడ్లు, బాలామృతం అందిస్తున్నామన్నారు. రెండవ దాంట్లో వైద్యాధికారుల సహకారంతో గర్భిణీలు, బాలింతలు, చంటి పిల్లలకు టీకాలు వేసేలా చూస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఆశా వర్కర్లు, ఎయెన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, సూపెర్వైజర్లు సమన్వయంతో పనిచేస్తూ హై రిస్క్ తో బాధపడుతున్న గర్భిణులు, పిల్లల ఆరోగ్య విషయంలో   సమయం ప్రకారం అన్ని విధాల వైద్య సౌకర్యాలు అందించేలా  మానిటరింగ్  చేస్తున్నామన్నారు.
కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చందు నాయక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయనిర్మల, జిల్లా మహిళా, శిశు,సంక్షేమ అధికారి బ్రహ్మాజీ, అంగన్వాడీ సూపర్ వైజర్లు, పిహెచ్ సి డాక్టర్, ఏ.యెన్.యంలు, ఆశా వర్కర్లు   తదితరులున్నారు.
కంటి వెలుగు శిబిరం సందర్శన
జిల్లాలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు మంచి స్పందన వస్తున్నదని, ప్రజలు ఇట్టి  శిబిరాలను  చేసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నర్సాపూర్  మండలం నారాయణపూర్ లో  ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని, సందర్శించారు. 41 వైద్య బృందాల ద్వారా 68 రోజుల  నుండి కంటి వెలుగు శిబిరాలు  నిర్వహిస్తూ జిల్లాలో 373 గ్రామ పంచాయతీలు, 65 వార్డులలో శిబిరాలు నిర్వహించి 3,73,358  మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి 40,853  మందికి రీడింగ్ అద్దాలు, 33,045  ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణి చేశామని, ప్రస్తుతం 25 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపల్ వార్డులలో కార్యక్రమం కొనసాగుతున్నదని అన్నారు.   జూన్ 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.