పైళ్ల శేఖర్ రెడ్డి గెలుపుకై యాదాద్రి వరకు పాదయాత్ర 

పైళ్ల శేఖర్ రెడ్డి గెలుపుకై యాదాద్రి వరకు పాదయాత్ర 

ముద్ర, భువనగిరి/యాదగిరిగుట్ట: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మూడవసారి భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలవాలని నాగిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ జక్క రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు గ్రామ యువకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పైళ్ల సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, చందుపట్ల మాజీ సింగిల్విండో చైర్మన్ బల్గూరి మధుసూదన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్బగానీ వెంకట్ గౌడ్, కేశవపట్నం రమేష్, మధు, దేవేందర్ నాయకులు పాల్గొన్నారు. పాదయాత్ర యాదాద్రి క్షేత్రం చేరుకొని అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.