ముఖ్యమంత్రి చిత్ర పటానికి క్షీరాభిషేకం...

ముఖ్యమంత్రి చిత్ర పటానికి క్షీరాభిషేకం...

మెట్‌పల్లి ముద్ర :- కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా నాలుగు గ్యారెంటీలు ప్రవేశ పెట్టిన సందర్భంగా  పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ నాయకులు మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం అతి తక్కువ కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం అని కొనియాడారు. కాంగ్రెస్ నాయకులు పుప్పాల శంకర్, ఎనుగందుల తిరుపతి గౌడ్,  మరుపక రాజేశ్వర్, పస్సుల రాజయ్య, భూక్య ప్రతాప్ నాయక్, మధుకర్ రెడ్డి,  మాజీ మేడిపల్లి వార్డ్ సభ్యుడు గంగాధర్ ,చిరంజీవి, రెడ్డబోయిన మహేష్, దీకొండ ప్రణీత్, లింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.