సి. ఏం.కే.సి. ఆర్. చిత్ర పటాని కి పాలాభిషేకం . 

సి. ఏం.కే.సి. ఆర్. చిత్ర పటాని కి పాలాభిషేకం . 

ముద్ర, వెంకటాపురం (నూ): ములుగు జిల్లా వెంకటాపురం మండలం లోని వి. ఆర్. ఏ.లు అందరూ సి.ఏం. కే. సి. ఆర్.గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి,పాలాభిషేకం చేశారు.సి.ఏం. కే. సి.ఆర్.గారు వి. ఆర్. ఏ.లను ప్రభుత్వం లో క్రమబధ్దికరిస్తు తీసుకున నిర్ణయానికి వెంకటాపురం వి. ఆర్. ఏ.లసంఘం అధ్యక్షులు కంటె బలరాం మరియు వి.ఆర్.ఏ. లు అందరూ కలిసి సి.ఏం. కే. సి.ఆర్.గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.వి.ఆర్. ఏ.లసంఘం అధ్యక్షులు కంటె బలరాం మాట్లాడుతూ సి.ఏం. కే. సి.ఆర్ గారు ఇచ్చిన మాట నూ,నిలబెట్టుకొని  భోలశంకరుడు  అని  మరొకసారి నిరూపించుకున్నారు అన్నారు. అలాగే   వీ .ఆర్. ఏ . అందరూ సి. ఏం.గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పి టి.సి. పాయం.రమణ గారు, బి.ఆర్. ఎస్. మండల అధ్యక్షులు గంప.రాంబాబు,పీ.మురళి. బాలసాని.వేణు తదితరులు పాల్గొన్నారు.