మానవత్వాన్ని చాటుకున్న పానుగల్ పోలీసులు

మానవత్వాన్ని చాటుకున్న పానుగల్ పోలీసులు
  • మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ముద్ర,పానుగల్:-పానుగల్ మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన బాలపీరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.మృతి చెందిన బాలపీరు కుటుంబాన్ని ఆదుకునేందుకు పానుగల్ SI వేణు తో పాటు పోలీస్ సిబ్బంది ఒక క్వింటాల్ బియ్యం,పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.మృతుడి భార్య శారద ఇటీవలే  ఆడ శిశువుకు జన్మనిచ్చింది.మృతుడి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి  గమనించిన ఎస్సై వేణు, పోలీస్ సిబ్బంది కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.పానుగల్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు .ఎస్ఐ వెంట హెడ్ కానిస్టేబుల్ చంద్ర శేకర్,పోలీస్ సిబ్బంది ఉన్నారు.