ప్రవళికది ఆత్మహత్య కాదు. .ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే...- పి డి ఎస్ యు. పి వై ఎల్ ల ఆరోపణ

ప్రవళికది ఆత్మహత్య కాదు. .ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే...-  పి డి ఎస్ యు. పి వై ఎల్ ల ఆరోపణ

ఆలేరు (ముద్ర న్యూస్): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో గల బృందావన్ వసతి గృహంలో నిరుద్యోగ విద్యార్థిని ప్రవళిక మరణం బాధాకరమని పి డి ఎస్ యు జిల్లా నాయకులు ఆర్ ఉదయ్. పి వై ఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మెజార్టీ కుమార్ లు ఆరోపించారు. శనివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రవళిక మరణించిన వసతి గృహం ముందు వేలాదిమంది నిరుద్యోగులు ఆందోళన నిర్వహించడం జరిగిందని అన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రవళిక సూసైడ్ ఉత్తరాన్ని చూపించాలని నిరుద్యోగులు పోలీసులతో వాగ్వివాదం చేసిన స్పందించకుండా వసతి గృహంలోకి ఎవరిని అనుమతించకపోవడంతో పలు అనుమానాలను వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.

టీఎస్పీఎస్సీ బోర్డు అధికారుల వైఫల్యం వల్లనే రాష్ట్రంలో విద్యార్థులు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రవళికది ముమ్మాటికి ఆత్మహత్య కాదని ఇది ప్రభుత్వ హత్యని వారు చెప్పారు. ప్రభుత్వం ప్రవళిక కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షణమే గ్రూపు పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ తో సహా సభ్యులందరినీ తొలగించి. టీఎస్పీఎస్సీ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులను నియమించాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి డీఎస్సీ పోస్టుల సంఖ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 13500 కు (బ్యాక్లాగ్ పోస్టులు కాకుండా అదనంగా) నియమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు మూడు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగే సడక్ బందుకు పిడిఎస్యు. పివైఎల్ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.....