విజయవంతమైన ల్యాంకో హిల్స్ వాసుల శాంతియుత ర్యాలీ...
ముద్ర, శేరిలింగంపల్లి:ఆగస్ట్ 24 న ఆర్‌జి కార్ గవర్నమెంట్ రెసిడెంట్ డాక్టర్ పై జరిగిన విషాద సంఘటనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మణికొండ ల్యాంకో హిల్స్ వాసులు పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు వారు సమావేశమై బాధిత డాక్టర్ కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. కోల్‌కతాలోని మెడికల్ కాలేజీ యాజమాన్యం మహిళల భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు ఇలాంటి హేయమైన చర్యలపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా ల్యాంకో హిల్స్ వాసులు సూచించారు.చట్టాన్ని అమలు చేసే అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేశారు.