పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి  : ఎన్ ఎస్ యు ఐ

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి  : ఎన్ ఎస్ యు ఐ

ముద్ర ప్రతినిధి భువనగిరి :తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను, ఫీజు రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్ ఎస్ యు ఐ  ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో  మంగళవారం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ  జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పోరేట్ స్కూల్ లపై, కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ లు 5వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ  జిల్లా ప్రధాన కార్యదర్శి సురుపంగ చందు, జిల్లా కార్యదర్శి పాండాల శరత్, నాయకులు ఎండి. అసాద్, బన్నీ, ఉగ్గి ప్రసాద్, లింగబాలు, విద్యార్థినీలు మానస, మౌనిక, శిరీష, సౌమ్య, కీర్తి  పాల్గొన్నారు.