ఎన్నికల నిర్వహణలో ప్రజలు సహకరించాలి -  ఫ్లాగ్ మార్చ్ ప్రారంభించిన ఎస్పీ ప్రవీణ్ కుమార్ 

ఎన్నికల నిర్వహణలో ప్రజలు సహకరించాలి -  ఫ్లాగ్ మార్చ్ ప్రారంభించిన ఎస్పీ ప్రవీణ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాబోయే ఎన్నికల నిర్వహణలో ప్రజలు సహకరించాలని ఎస్పీ ప్రవీణ్ కుమార్ ప్రజలను కోరారు. నిర్మల్ లో  పారా మిలిటరీ దళాల ఫ్లాగ్ మార్చ్ ను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం పారా మిలిటరీ దళాలతో కలిసి పట్టణంలోని గాంధీ చౌక్, బుధవార్ పేట తదితర వీధుల గుండా కవాతులో పాల్గొన్నారు. అనంతరం పారా మిలిటరీ దళాలకు ఎన్నికలకు సంబంధించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ సూచించిన సూచనల ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు.రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇప్పటి నుండే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 136 సమస్యాత్మక , మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలు 17 ఉన్నాయన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినా, గొడవలు సృష్టించాలని చూసినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి గంగారెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీఐ పురుషోత్తమా చారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రాంనిరంజన్, రమేష్, రామకృష్ణ, యంటిఓ వినోద్, ఎస్ఐలు, సాయుధ దళాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.