కాగ్న వాగులో నీటి ప్రవాహానికి కొట్టిపోయి వ్యక్తి గల్లంతు గాలిస్తున్న పోలీసులు గ్రామస్తులు

కాగ్న వాగులో నీటి ప్రవాహానికి కొట్టిపోయి వ్యక్తి గల్లంతు  గాలిస్తున్న పోలీసులు గ్రామస్తులు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : అతివృష్టి వర్షాల కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తాండూరు నియోజకవర్గం లో వాగులు వంకలు ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాండూరు మండలం సంగం కలాన్  గ్రామానికి చెందిన బొక్తం పల్లి పెంటయ్య అనే వ్యక్తి వాగు దాటే ప్రయత్నం లో కొట్టుకుపోయాడు. గ్రామానికి చెందిన బొక్తంపల్లి పెంటప్ప(48) శుక్రవారం ఉదయం కర్ణాటక రాష్ట్రం షాపూర్ లో బందువుల అంత్యక్రియలకు వెళ్లి సాయంత్రం తరువాత గ్రామానికి తిరిగి వచ్చారు. వాగు భారీ వర్షాల కారణంగా ప్రవహించడం తో ఓ కల్లు దుకాణం వద్ద కూర్చున్నారు.

 కొద్దీ సేపు తర్వాత పెంటయ్య స్థానికులు చెప్పిన వినకుండా వాగు దాటే ప్రయత్నం చేసాడు. వాగు ఉదృతంగా ప్రవహించడం తో పెంటయ్య వాగులో కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. పెంటప్ప కొట్టుకుపోయిన వాగు గుండా గ్రామస్తులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న కరణ్ కోట్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.