ఆస్తి కోసం కన్న తల్లిని,కుమార్తెలను చంపినా దుర్మార్గుడు...

ఆస్తి కోసం కన్న తల్లిని,కుమార్తెలను చంపినా  దుర్మార్గుడు...

ముద్ర,తెలంగాణ:- ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు. తన పేరుపై ఉన్న ఆస్తి రాసివ్వడం లేదని కోపం పెంచుకున్న వెంకటేశ్వర్లు.. తల్లి పిచ్చమ్మ(60)ను గొంతు నులిమి చంపాడు. అనంతరం ఇద్దరు కుమార్తెలు నీరజ(10), ఝాన్సీ(6)లను చంపి పారిపోయాడు.పొలం తన పేరుపై రాయాలంటూ తల్లిని వెంకటేశ్వర్లు కొన్నేళ్లుగా వేధిస్తున్నట్లు సమాచారం. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, వెంకటేశ్వర్లు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, రెండేళ్ల క్రితం భార్యను కూడా హత్య చేశాడని స్థానికులు తెలిపారు.