అత్తాపూర్ ఎస్ ఆర్ డిజి స్కూల్ లో 8 తరగతి విద్యార్థిని పట్ల పి ఇ టి అసభ్య ప్రవర్తన - స్కూల్ పై విద్యార్థిని తల్లిదండ్రు లు, బంధువుల దాడి

అత్తాపూర్ ఎస్ ఆర్ డిజి స్కూల్ లో 8 తరగతి విద్యార్థిని పట్ల పి ఇ టి అసభ్య ప్రవర్తన - స్కూల్ పై విద్యార్థిని తల్లిదండ్రు లు, బంధువుల దాడి

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : అత్తాపూర్ లోని ఎస్ ఆర్ డిజి స్కూల్ లో 8 తరగతి విద్యార్థిని పట్ల పి ఇ టి అసబ్యం గా ప్రవర్తించటం తో పాటూ ఫోన్ ద్వార ఇబ్బంది పెట్టడంతో  విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ పై శనివారం  దాడి చేశారు. స్కూల్ లో పని చేస్తున్నా  పి ఇ టి విష్ణు స్కూల్ లో 8 వ క్లాస్ చదువుతున్నా విద్యార్థిని తో అసభ్యంగా ప్రవర్తించి, దురుసుగా ప్రవర్తించి, విద్యార్థినికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టే వాడని విద్యార్థి తల్లిదండ్రులు తేలిపారు.

పి ఇ టి విష్ణు విషయం తల్లిదండ్రులకు  విద్యార్థిని చెప్పడం తో స్కూల్ వద్దకు చేరుకున్న విద్యార్ధిని తల్లిదండ్రులు., బంధువులు... స్కూల్ లో ఉన్న  ఫర్నీచర్, కంప్యూటర్ రూమ్ లో వస్తువులను  ధ్వంసం చేసారు. స్కూల్ లో ఉన్న ప్రిన్సిపాల్, ఇతర ఉపాధ్యాయుల పై దాడి చెయ్యడం తో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పి ఇ టి విష్ణు పారిపోయాడు.  

ఈ విషయం పై విద్యార్థిని తల్లిదండ్రులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.