పిల్లి రామరాజుకు బీఆర్ఎస్ తో సంబంధం లేదు

పిల్లి రామరాజుకు బీఆర్ఎస్ తో సంబంధం లేదు

ముద్ర ప్రతినిధి, నల్గొండ:నల్గొండ బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజుపై ఆ పార్టీ నేతలు సస్పెన్షన్ వేటు వేశారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలసి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పిల్లి రామరాజు కార్యక్రమాలు నిర్వహించడంతో సస్పెన్షన్ నిర్ణయాన్ని ప్రకటించామని వారు తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నందుకు అధిష్టానం సీరియస్ గా పరిగణించిందని పేర్కొన్నారు. పిల్లి రామరాజు నిర్వహించే సమావేశాలు, ఇతర రాజకీయ కార్యక్రమాలకు, బీఆర్ఎస్ కు సంబంధం లేదని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.