రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లో ప్లాస్టిక్ గుడ్ల కలకలం

రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లో ప్లాస్టిక్ గుడ్ల కలకలం

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రానికి చెందిన కీర్తి సంజీవ ఆదివారం రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లో కోడి గుడ్ల ట్రైను కొనుగోలు చేశాడు. అయితే మంగళవారం వాటిని ఉడకబెట్టే క్రమంలో అతనికి అనుమానం వచ్చి పరీక్షించగా ప్లాస్టిక్ గుడ్లుగా దర్శనం ఇవ్వడంతో హవాకయ్యాడు.

వెంటనే స్మార్ట్ పాయింట్ కు వెళ్లి యజమాన్యాన్ని సంజీవ ప్రశ్నించగా ఏం చేసుకుంటారో చేసుకోండి.. మాకు ఏం సంబంధం లేదు.. కావాలంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము అంటూ దురుసుగా సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పొరపాటున ఇలాంటి గుడ్లను తింటే రోగాల బారిన పడటం గ్యారెంటీ అని, వీటితో ఆరోగ్యం పాడవడంతో పాటు వైద్యం కోసం పెట్టే ఖర్చు, లక్షల్లో ఉంటుందన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న  రిలయన్స్ స్మార్ట్ పాయింట్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ వీడియో వాట్సాప్ గ్రూప్ లలో, సోషల్ మీడియాలో వేరల్ గా మారింది.