ఎర్రచందనం స్మగ్లర్లు ఇద్దరు అరెస్టు

ఎర్రచందనం  స్మగ్లర్లు ఇద్దరు అరెస్టు
tirupathi reesandalwood case

ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఇంటర్‌ స్టేట్‌ స్మగ్లర్‌ మురుగన్‌ తో పాటు, మరో వాంటెడ్‌ స్మగ్లర్‌ మేఘవర్ణంలను అరెస్టు చేసినట్లు టాస్క్‌ ఫోర్సు ఎస్పీ కే చక్రవర్తి వెల్లడిరచారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ డీఐజీ సెంథిల్‌ కుమార్‌ సూచనల మేరకు తన ఆదేశాలతో సీఐ రామకృష్ణ టీమ్‌  తిరుపతి జిల్లా రేణిగుంట మండలం, టీఎన్‌ పాలెం సెక్షన్‌ కరకంబాడి ఫారెస్ట్‌ బీట్‌ పరిధలోని శ్రీకాళహస్తి`రేణిగుంట రోడ్డులో వాహనాలను తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. ఉదయం 8గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి వైపు నుంచి కారు,  లారీ వస్తూ కనిపించాయి. వారిని నిలుపగా వాహనాల్లోని వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిలో ఇద్దరిని పట్టుకోగా, వారిలో తమిళనాడు తిరువళ్లూరుజిల్లా సోలవరంకు చెందిన పి.మురుగన్‌ (40), రేణిగుంట రోడ్డు టీఎన్‌ పాలెం పద్మావతి నగర్‌ కు చెందిన ఎస్కే మేఘవర్ణం (66) ఉన్నారు. వీరిలో మురుగన్‌ ఇంటర్‌ స్టేట్‌ స్మగ్లర్‌ కాగా, టాస్క్‌ ఫోర్సు పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆరు కేసులు ఉన్నాయి.  ఇతనికి అంతర్జాతీయ స్మగ్లర్లతో  సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. వీరిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

మేఘవర్ణంపై కూడా కొన్ని కేసులు ఉన్నట్లు తెలిపారు. వీరి నుంచి ఒక ఈచర్‌, మరొక స్విఫ్ట్‌ కారుతో పాటు 18ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వీటి విలువ రూ.50లక్షలు ఉంటుందని తెలిపారు.  కేసును సిఐ చంద్రశేఖర్‌ దర్యాప్తు చేస్తున్నారు. టీమ్‌ లొ పాల్గొన్న సిబ్బందికి ఎస్పీ రివార్డులు ప్రకటించారు....